టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడమే నా లక్ష్యం: దినేష్ కార్తీక్

-

ఐపీఎల్ 2002: భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యమని వెటరన్ వికెట్ కీపర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫినిషర్ దినేష్ కార్తీక్ తెలిపాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తో శనివారం జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తీక్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు.దాంతో ఆర్సిబి 16 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది.ఐపీఎల్ 2022 సీజన్లో నిలకడగా ఆడుతూ ఆర్సిబి ఫినిషర్ గా తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడు.

దీంతో అప్ కమింగ్ ప్రపంచకప్ లో దినేష్ కార్తీక్ ను తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది.ఇక మ్యాచ్ అనంతరం కార్తీక్ సైతం టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యం అని చెప్పాడు.టీమిండియాలో చోటు కోసం తాను అన్ని విధాలుగా కష్టపడుతున్నానని చెప్పాడు.ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న t20 ప్రపంచకప్ లో భారత జట్టు తరఫున మళ్లీ ఆడాలనేది నా లక్ష్యం.టీ20 ప్రపంచకప్ దగ్గరలోనే ఉందని నాకు తెలుసు.నేను జట్టులో చోటు కోసం చాలా కష్టపడుతున్నారు.వరల్డ్ కప్ జట్టులో భాగమై భారత్ విజయం లో నా వంతు పాత్ర పోషించాలని అనుకుంటున్నాను.భారత్ ఐసీసీ టోర్నమెంట్లలో గెలిచి చాలా కాలం అయింది.కాబట్టి భారత్ ఈ ప్రపంచ కప్ లో టైటిల్ నెగ్గాలని కోరుకుంటున్నాను.అని కార్తీక్ పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news