కేసీఆర్‌ కేబినేట్‌ లో నేనుంటే..బావిలో దూకి ఆత్మహత్య చేసుకునేవాన్ని -బండి సంజయ్‌

-

జోగులాంబ గద్వాల: కేసీఆర్‌ కేబినేట్‌ లో నేను మంత్రిగా ఉండుంటే..బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకునే వాన్ని అంటూ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాల్లాపూర్ పాదయాత్ర మీటింగ్ లో బండి సంజయ్ మాట్లాడారు. ఇక్కడ రోగమొస్తే పక్క రాష్ట్రంలో ట్రీట్ మెంట్ తీసుకోవాలా? అంటూ నిప్పులు చెరిగారు.

ఇక్కడ యువకులకు ఉద్యోగాల్లేక అల్లాడుతున్నారని.. తెలంగాణలో బాగుపడ్డదెవరు? ఎవరికి పదవులొచ్చాయో ఆలోచించండని కోరారు బండి సంజయ్‌. తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా? అని ప్రశ్నించారు. ఒక కాలేజీ, ఆసుపత్రి కూడా కట్టివ్వలేని దుస్థితి మంత్రులది, ప్రభుత్వానిదని.. కేసీఆర్ కేబినెట్ లో నేను మంత్రిగా ఉండి ఉంటే బావిలో దూకి చచ్చేటోడినన్నారు. పైసలిస్తే పేదోళ్లు ఓట్లేస్తారనే భ్రమల్లో కేసీఆర్ ఉన్నాడని… కేసీఆర్ ఫ్రభుత్వాన్ని కూల్చి బుద్ది చెప్పండని ప్రజలకు పిలుపునిచ్చారు బండి సంజయ్‌. త్వరలోనే బీజేపీ సర్కార్‌ వస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news