అమరావతి : ముస్లింలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ నెల 26వ తేదీన ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు సీఎం జగన్. ఈ మేరకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు, వైసీపీ పార్టీ నేతలు.
ఇందులో భాగంగానే ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పరిశీలించారు డెప్యూటీ సీఎం అంజాద్ బాషా. ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుకు ముస్లింలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు డెప్యూటీ సీఎం అంజాద్ బాషా. ఐదు వేల మంది ఇఫ్తార్ విందుకు హాజరవుతారని అంచనా వేశామని పేర్కొన్నారు డెప్యూటీ సీఎం అంజాద్ బాషా. గత ప్రభుత్వం తరహాలో పండుగలకు తోఫాలు ఇచ్చి సరిపెట్టం.. భారీగా సంక్షేమం అమలు చేస్తున్నాం… తోఫాల పేరుతో అవినీతి చేసే పద్దతి మాది కాదని వెల్లడించారు డెప్యూటీ సీఎం అంజాద్ బాషా.