సీనియర్ మంత్రి బొత్స కినుక వహించారు
ఆ విధంగా ఆయన తన అసంతృప్తిని చాటుతున్నారు
ఓ విధంగా క్యాబినెట్ మార్పులలో భాగంగా ఆయనకు
నో ఛాన్స్ అని చెప్పారు కానీ తరువాత జగన్ మనసు
మారిపోయింది. ఆఖరకు ఆయనకు అమాత్య పదవి వరించింది మళ్లీ !

కానీ సంతృప్తి మాత్రం దక్కడం లేదు అని తెలుస్తోంది.
తనకు అప్పగించిన విద్యాశాఖను మార్చాల్సిందిగా బొత్స సత్యనారాయణ పట్టుబడుతున్నారు. గతంలో మాదిరిగా తనకు పురపాలక శాఖనే అప్పగించాలని కోరుతున్నారు. అయితే ఇందుకు సీఎం ససేమీరా అంటున్నారు అని తెలుస్తోంది. శాఖల మార్పు ఇప్పట్లో ఉండదని కూడా తేల్చేశారు.ఈ నేపథ్యంలో మన లోకం న్యూస్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
గడిచిన కొద్ది రోజులుగా ఏపీ క్యాబినెట్ లో మార్పులపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. మంత్రి వర్గంలో మార్పులు కారణంగా ఇప్పటికే కొందరు అసహనంతో రగిలిపోతున్నారు. ఇంకొందరు తమను ఎందుకు గద్దె దించాలని భావించారో కారణాలు చెప్పాలని అధిష్టానంపై ఒత్తిళ్లు కూడా తెచ్చారు.ఇవన్నీ ఓ వైపు జరుగుతుండగానే మరోవైపు రామకృష్ణా రెడ్డి అసంతృప్తవాదులను ఒక్కొక్కరినీ పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అసంతృప్త వాదం వినిపించిన వారిలో మొదట నిలచిన మాజీ విద్యుత్ శాఖ మంత్రి, ప్రకాశం జిల్లా నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచి మాజీ హోం మంత్రి, గుంటూరు జిల్లా మేకతోటి సుచరిత వరకూ అందరినీ ఓ దారిలోకి తెచ్చారు. కానీ ఇంకా కొన్ని సమస్యలు వస్తున్నాయి. అవే శాఖల కేటాయింపు.

వాస్తవానికి ఆఖరి నిమిషం వరకూ ఎవరికి ఏ శాఖ కేటాయించారో కూడా తమకు తెలియదు అని సాక్షాత్తూ వైసీపీ వర్గాలే వ్యాఖ్యానించాయి. కానీ తరువాత శాఖల లెక్కలు తేలిపోయాక మంత్రి బొత్స శాఖను ఆదిమూలం సురేశ్ కు అప్పగించారు.
అప్పటిదాకా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన తాజా నిర్ణయాలు మరియు మార్పులు కారణంగా విద్యాశాఖ మంత్రి అయ్యారు. అప్పటిదాకా విద్యాశాఖ ను చూసిన సురేశ్ కాస్త మున్పిపల్ శాఖకు సంబంధించి పగ్గాలు అందుకున్నారు. దీంతో విద్యాశాఖ పరంగా బొత్స ఉండి చేసేదేముందని చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయినా వాటిని కూడా భరించారు బొత్స . కానీ ఇటీవల విద్యాశాఖకు సంబంధించి సీఎం నిర్వహించిన సమీక్షకు బొత్స గైర్హాజరయ్యారు. ఏ విషయంలోనూ తన మాటను చెల్లనివ్వడం లేదని ఆయన ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.