Dunki: అఫీషియల్: రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో షారుఖ్ ఖాన్..మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్

-

బీ టౌన్ సెలబ్రిటీలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ నటీనటులందరూ ఒక్క చిత్రమైన, కనీసం ఒక్క పాత్ర అయినా రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో నటించాలని అనుకుంటారు. సహజత్వాని పెద్ద పీట వేయడంతో పాటు ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు ఎంగేజ్ చేయగల సత్తా ఆయన సినిమాల్లో ఉంటుంది. స్టోరి పరంగా కాని మేకింగ్ పరంగా కాని క్యారెక్టరైజేషన్ పరంగా కాని రాజ్ కుమార్ హిరాని సినిమాలకు ఆ క్రేజ్ ఉంది.

ఈ క్రమంలోనే మంగళవారం తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు రాజ్ కుమార్. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. అది చూసి షారుఖ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిక్చర్ డెఫినెట్ గా ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ తిరగ రాస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు రాజు హిరానీ. డంకీ(Dunki) టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్ గా తాప్సీ పన్నును ఫైనల్ చేశారు. తొలిసారి రాజ్ కుమార్ హిరాని – షారుఖ్ ఖాన్ రాబోతుండటం పట్ల సినీ అభిమానుల అంచనాలు పెరిగాయి. వచ్చే ఏడాది డిసెంబర్ 22న సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news