నెక్స్ట్ ఏం చెయ్యాలి అన్న విషయం పై విద్యార్థులకి క్లారిటీ ఉండాలి. అలానే వాళ్లకి కోర్సుల పైన కూడా అవగాహన ఉండాలి. మంచి సక్సెస్ ని అందుకోవాలన్నా… మంచిగా టాప్ లో ఉండాలన్నా మీరు తీసుకునే స్టెప్ చాలా ముఖ్యం.
అందుకనే విద్యార్థులు పదే పదే తమ కోర్సుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా మంచి కెరీర్ ని ఎంచుకోవాలని అనుకుంటున్నారా..? ఏం చదివితే బాగుంటుంది అన్న ఆలోచనలో పడ్డారా..? ఐటీ మీద ఆసక్తి లేదా..? ఇతర కోర్సుల కోసం తెలుసుకోవాలనుకుంటున్నారా..?
అయితే ఐటి రంగాలు కాకుండా ఇక్కడ కొన్ని కోర్సులు ఉన్నాయి. నాన్ ఐటీ రంగాలు కూడా ఈ మధ్య కాలం లో దూసుకుపోతున్నాయి పైగా ఐటీకి ధీటుగా ఈ రంగాల్లో వేతనాలు కూడా ఇస్తున్నాయి. మరి నాన్ ఐటీ కోర్సుల గురించి ఇప్పుడు చూద్దాం. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూసేయండి.
ఫార్మా:
ఈ మధ్య ఫార్మా రంగానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. చాలా మంది విద్యార్థులు ఈ రంగాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ఫార్మా రంగానికి ప్రాధాన్యత వచ్చింది. బయో ఫిజిక్స్ మైక్రోబయాలజీ రంగాల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయి. మీరు ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నట్లయితే నెక్స్ట్ మీరు ఫార్మా రంగంలోకి వెళ్తే మంచిగా సక్సెస్ అవడానికి అవుతుంది.
ఇన్సూరెన్స్ రంగం:
బీమా రంగంలో ఉద్యోగాల కల్పన రేటు రోజురోజుకీ పెరుగుతోంది మీకు ఇన్సూరెన్స్ రంగం పై ఆసక్తి ఉంటే దీనిని కూడా మీరు కెరియర్ కింద ఎంచుకోవచ్చు. పైగా చక్కగా సక్సెస్ కావడానికి కూడా హెల్ప్ అవుతుంది.
హాస్పిటాలిటీ:
ఈ రంగానికి కూడా ఈ మధ్య కాలంలో ప్రాధాన్యత ఎక్కువ వచ్చింది చాలా మంది ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. హాస్పిటాలిటీ, ట్రావెల్ వంటి వాటిని కెరీర్ కింద చాలా మంది ఎంచుకుంటున్నారు గతంలో కంటే ఇప్పుడు ప్రాధాన్యత ఎక్కువ వచ్చింది, రానురాను ఇంకా ప్రాధాన్యత వస్తుంది కనుక నాన్ ఐటీ వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా బెస్ట్ ఆప్షన్.
ఫైనాన్స్:
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో కూడా గ్రోత్ ఉంటుంది. దీనిని కూడా మీరు కెరీర్ కింద ఎంచుకోవచ్చు మంచిగా సక్సెస్ కావడానికి ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి నాన్ ఐటీ రంగం వైపు వెళ్లాలి అనుకునే వాళ్ళు ఈ రంగాలను ఎంచుకోవచ్చు.
లైఫ్ సైన్స్:
లైఫ్ సైన్సెస్ విభాగం లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. నాన్ ఐటీ రంగం వైపు వెళ్లాలి అనుకునే వాళ్ళు దీనిని అయినా సెలెక్ట్ చేసుకోచ్చు.