తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు ఎల్లో , ఆరెంజ్ అలెర్ట్

-

భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. సాయంత్రం 6 కానిదే ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. దీనికి తోడు ఉక్కపోతలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏదైనా అత్యవసరం పడితే తప్పితే… జనాలు ఇళ్లు వదిలి బయటకు కదలడం లేదు. నిన్న అత్యధికంగా కుమ్రం భీం జిల్లాలో 44.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. కుమ్రం భీం జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్, ములుగు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

గత రెండు రోజుల నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తాజాగా ఈరోజ( గురువారం) కూడా భారీగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటు జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ లో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. నిన్న మాదాపూర్ లో అత్యధికంగా 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇదిలా ఉంటే ఎండల పెరుగుతున్న క్రమంలో వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. అన్ని జిల్లాల్లో కూడా వడగాలులు వీస్తాయని వెల్లడించింది. మేడ్చల్, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news