కరెంటు తీస్తే మూడు నిమిషాల్లో తిరిగి ఇవ్వాలి: కేంద్రం

-

దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో 12 రాష్ట్రాలు అల్లాడుతున్నాయి.ఏపీ, యూపీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో 8 గంటల పాటులపాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి.దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.విద్యుత్ కోతలపై స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.లక్ష అంతకు మించి జనాభా ఉండే పట్టణాలలో డిస్కంలు 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ ను సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ సూచించింది.ఈ నిబంధనను తక్షణమే అమలులోకి తీసుకు రావాలని పేర్కొంది. ఇందుకుగాను ప్రతి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలీ సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

విద్యుత్ కోతల కారణంగా దేశంలో చాలా పట్టణాల్లో డీజిల్ జనరేటర్ల వినియోగం పెరిగింది.దీంతో కాలుష్యం గరిష్ఠ స్థాయిలో పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.ఈ పరిస్థితిని నివారించాలంటే కచ్చితంగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని అభిప్రాయ పడింది.లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో కచ్చితంగా కరెంటు తీసేసిన మూడు నిమిషాల్లోనే పునరుద్ధరించాలని ఆదేశించింది.అలా చేస్తేనే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసినట్లు అవుతుందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news