నమ్మిన సిద్దాంతం కోసం ఆకరి వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రెడ్ సీతారాం ఏచూరి అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఇతరులకు ఆదర్శంగా నిలబడ్డారంటే..వారు దేశానికి అంకితమయ్యారు. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలి. జమిలి ఎన్నికలకు మేము వ్యతిరేకం అని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.
జమిలి ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు సీతారాం ఏచూరి లేకపోవడం దేశానికే నష్టం అన్నారు. గాంధీ కుటుంబానికి సీతారాం ఏచూరి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ సీతారాం ఏచూరిని చాలా ఇష్టపడుతారు. చనిపోయిన తరువాత కూడా ప్రజలకు ఉపయోగపడిన నేత సీతారాం ఏచూరి. జైపాల్ రెడ్డికి సమకాలికులు సీతారాం ఏచూరి అన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎదిగిన ప్రాధాన్యత.. నమ్మిన సిద్ధాంతం కోసం ఇచ్చే వారు చాలా అరుదు. బ్రతికి ఉన్నంత కాలం ప్రజల పక్షాన నిలబడ్డారు. వారి మరణాణంతరం కూడా ప్రజలకు ఉపయోగపడాలని ఆయన శవాన్ని ప్రజలకు ఇచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు. చారిత్రాత్మకమైన సందర్భం అన్నారు. సీతారాం ఏచూరి లేకపోవడం పేదలకు తీరని నష్టం అన్నారు.