కేంద్ర ప్రభుత్వ శాఖల్లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వంలోని వేర్వేరు శాఖలలో వేర్వేరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం లోని వేర్వేరు శాఖల లో వేర్వేరు పోస్టుల భర్తీ కోసం తాజాగా ఈ నోటిఫికేషన్ ని విడుదల చేయగా మొత్తం 67 ఉద్యోగ ఖాళీలు వున్నాయి.

jobs
jobs

ఇంటర్వ్యూ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు. ఎలాంటి రాత పరీక్ష కూడా లేదు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిస్ట్, సబ్ డివిజనల్ ఇంజనీర్ ఇతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 12. కనుక ఈ లోగా ఆసక్తి వున్న వాళ్లు అప్లై చేసుకోవాలి.

అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. అర్హతలను చూస్తే.. సంబంధిత సబ్జెక్టుల లో పీజీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అప్లై చేసుకో వచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సైతం వెబ్ సైట్ ద్వారా తెలుసుకోచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం చెల్లిస్తారు. https://www.upsconline.nic.in/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను మీరు తెలుసుకో వచ్చు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news