రోజురోజుకు ఏపీలో ప్రజల పరిస్థితి ఆద్వానంగా తయారవుతోందని టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యుడ వర్ల రామయ్య మండిపడ్డారు. సామన్య ప్రజలకే అంటే.. కనీసం ప్రభుత్వ అధికారులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వర్ల రామయ్య డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. మట్టి మాఫియా గుడివాడ ఆర్ఐపై ఎదురు కేసు పెట్టడంపై లేఖ ద్వారా వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపైనే కేసు పెట్టారంటే మట్టి మాఫియా ఎంత శక్తివంతంగా ఉందో తెలుస్తోందని లేఖలో ఆరోపించారు వర్ల రామయ్య.
అక్రమ మైనింగ్‌కు పాల్పడి రెవెన్యూ అధికారిపై దాడి చేసిన మాఫియాను అరెస్టు చేయకుండా బాధితుడైన ఆర్ఐపై కేసు నమోదు చేయడం దుర్మార్గ చర్య అని, బాధితుడిపై పోలీసులు కేసు నమోదు చేయడం అంటే ప్రజల్లో పోలీసులపై నమ్మకం సన్నగిల్లేట్లు చేయడమేనని వర్లరామయ్య లేఖలో పేర్కొన్నారు. పోలీసుల్లో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పోలీసు వ్యవస్థను నాశనం చేసేలా క్రిమినల్స్‌ను కాపాడుతున్నారని వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.