పాకిస్తాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైతన తర్వాత షహబాజ్ షరీఫ్ తొలిసారిగా సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. గత కొంత కాలంగా అరబ్ దేశాలతో పాక్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో పాకిస్థాన్ కు సమస్యలు ఉన్నప్పుడు అప్పులిచ్చి ఆదుకునే దేశాలు ఇటీవల కాలంలో ముహం చాటేశాయి. దీంతో మళ్లీ గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలపరుచుకునేందుకు సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు షహబాజ్ షరీఫ్.
ఇదిలా ఉంటే సౌదీ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు ఘోర అవమానం జరిగింది. సౌదీలో మదీనాలో పర్యటిస్తున్న సయమంలో అక్కడ ఉన్న ప్రజలు చోర్..చోర్( దొంగ…దొంగ) అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. పెద్ద ఎత్తున పాక్ ప్రధానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. వందలాది మంది యాత్రికులు మస్జిద్-ఎ-నబవికి వెళ్తున్న పాకిస్తాన్ ప్రతినిధి బృందాన్ని చూసి “చోర్ చోర్” [దొంగలు] నినాదాలు చేయడం వీడియోలో కనిపిస్తోంది.
After Saudi Arabia Accepted Israel
Shaitan given full protocol by Saudi
Security Services in Masjid ul Nabwi
Rather than throwing Stones at him who gives a shit brave pakistani chanted chor chor at Shehbaz Sharif.
Salute to brave Pakistani🖖#PMShehbazInKSA#امپورٹڈ_حکومت_نامنظور pic.twitter.com/Q4KPwvxatY— SADAT KHAN (@hotdevil07) April 28, 2022