కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ చూడడం మిస్ అయిన వారు అమెజాన్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫాంలలో చూస్తుంటారు. అయితే ఒక్క సినిమా కోసం నెల, సంవత్సరానికి మెంబర్ షిప్ తీసుకోవడం ఎందుకులే అని పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి వారి కోసం అమెజాన్ ప్రైమ్ గుడ్‌న్యూస్ తీసుకువచ్చింది. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజమైన అమెజాన్ త్వరలోనే ట్రాన్సాక్షన్-వీడియో-ఆన్-డిమాండ్ (TVoD) ఆఫర్ కింద.. ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లు, నాన్-సబ్‌స్క్రైబర్‌లు అద్దెకు సినిమాలను చూడవచ్చు. అంటే.. మనకు చూడాలనుకున్న సినిమాను చూసేందుకు మాత్రమే.. మనం చూడాలనుకు ఎపిసోడ్, ఒరిజినల్స్, వీడియోలు ఎవైనా సరే.. ఆ వీడియోను బట్టి ధర ఉంటుంది.
పే-పర్-వ్యూ సేవను వినియోగించుకోవడానికి వినియోగదారులు యాప్, వెబ్‌సైట్‌లోని పే పర్ వ్యూ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ధరలు మనం చూసే వీడియోను బట్టి ₹69 నుండి ₹499 వరకు ఉంటాయి. సినిమా 30 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది కానీ 48 గంటల విండోలోపు తప్పక వీక్షించబడాలి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఓటీటీలోనే ఒరిజినల్స్‌ను అందించిన అమెజాన్ ప్రైమ్.. త్వరలోనే చలనచిత్ర పరిశ్రమలోని నేరుగా అడుగు పెట్టబోతోంది. తెలుగు, హిందీలో సినిమాలు చేసేందుకు అడుగులు వేస్తోంది.