జనాలు మాములుగా ఏ సినిమా హీరోనో, హీరోయిన్ వాళ్ల ఏరియా, ఊరుకు వస్తే.. వాళ్లను చూసేందుకు తెగ ఎగబడుతారు. యువతులైన తమకు నచ్చిన స్టార్ హీరోలు కనిపిస్తే కేరింతలు కొడుతూ చేతులూపుతుంటారు. అయితే ఈ రోజు మంత్రి హరీష్ రావు ఫాలోయింగ్ చూస్తే.. సెలబ్రెటీలకు తక్కువ కాదనిపిస్తోంది. ఈ రోజు మంత్రి హరీష్ రావు నిజామాబాద్ జిల్లాలో పర్యటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అనంతరం సభ ప్రాంగణాన్ని విడిచి వెళుతున్న మంత్రి హరీష్ రావుతో సెల్ఫీలు దిగేందుకు యువతులు పోటీపడ్డారు. అయితే ఈ సన్నివేశానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతేకాకుండా తన నియోజకవర్గంలోనే కాకుండా హరీష్ రావుకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని కొందరు అంటున్నారు. చిన్న పెద్దా లేకుండా అందరూ మంత్రి హరీష్‌రావును ఆదరిస్తున్నారని, అభిమానిస్తున్నారని మరి కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.