బైక్ ట్యాక్సీ ర్యాపిడోతో పరిచయమైన వ్యక్తితో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఫస్ట్‌లాన్సర్‌లో నివసించే వివాహితకు ఇటీవలే భర్తతో విడాకులు తీసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. అయితే సదరు మహిళ
రెండేళ్ల క్రితం ర్యాపిడో బైక్ నడిపే రషీద్‌తో పరిచయం ఏర్పడింది. అయితే ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. కొంత కాలం వీరి సహజీవనం బాగానే ఉన్నా ఇటీవల మనస్పర్థలకు దారి తీయడంతో సదరు మహిళ రషీద్‌ను దూరం పెట్టింది.
రెండు నెలల క్రితం లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేయడంతో.. అక్కడి పోలీసులు రషీద్‌ను మందలించి వదిలేశారు. అయినాసరే నిందితుడిలో మార్పు రాలేదు. ఇటీవల తెల్లవారుజామున బలవంతంగా ఆమె ఇంట్లోకి ప్రవేశించి బెల్ట్‌తో బాది ఆమె అంగీకారం లేకుండానే లైంగిక దాడికి పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై 376(2), 323, 417, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.