మొన్నటి వరకు పరుగులు పెట్టిన పసిడి ధరలు తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే నేడు స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో ఆదివారం తో పోలిస్తే.. ఈ రోజు బంగారం ధరలు సల్పంగా తగ్గగా, వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈరోజు సోమవారం నాటికి బంగారం ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.48,390ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,790గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,020గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,480గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,390గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,790గా ఉంది. ఏప్రిల్ నెలలో ధరలు తగ్గడం గత మూడు నెలలో ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఏప్రిల్ నెల ప్రారంభంలో పెరిగిన ధరలు ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి.