జెర్సీ మూడు రోజుల కలెక్షన్స్‌.. మరో 5 రోజులు గడిస్తేనే

-

ఎమోషనల్‌ జెర్సీకి జనాలు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. నాచురల్‌ స్టార్‌ నాని, శ్రద్ధా శ్రీనాథ్ ల సహజనటన, గౌతం తిన్ననూరి దర్శకత్వ ప్రతిభ జెర్సీని ఫీల్‌ గుడ్‌ మూవీ అనిపించాయి. విడులైన తొలి రోజు నుండే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా మాస్‌ అడియన్స్‌కి చేరటానికి టైమ్‌ పట్టింది. ముఖ్యంగా జెర్సీకి మౌత్‌ టాక్‌ చాలా ప్లస్‌ అయ్యిందనే చెప్పాలి. శనివారం నుండి వసూళ్లు ఊపందుకుని 3 రోజుల్లో జెర్సీ సినిమా 10 కోట్ల 67 లక్షల రూపాయల షేర్ సాధించింది.

అయితే జెర్సీ మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 20 కోట్లు కాగా ఈ మూడు రోజుల్లో సగం రాబట్టగలిగింది జెర్సీ. వరల్డ్ వైడ్ ఈ సినిమాను 26 కోట్ల రూపాయలకు అమ్మారు. మరో 5రోజులపాటు సేమ్‌ కన్టీన్యూ అయితే అప్పుడు లాభాల్లోకి వస్తుంది. రానున్న రోజుల్లో పెద్ద సినిమాలు లేకపోవడం జెర్సీకి కలిసొచ్చే అంశం. అవెంజర్స్‌-ఎండ్‌ గేమ్‌ ఒక్కటే మల్టీప్లెక్స్‌ల్లో పోటీకి రావచ్చు.

ఈ 3 రోజుల్లో జెర్సీ వచ్చిన వసూళ్లు

నైజాం – రూ. 4.92 కోట్లు
సీడెడ్ – రూ. 1 కోటి
ఉత్తరాంధ్ర – రూ. 1.31 కోట్లు
ఈస్ట్ – రూ. 0.86 కోట్లు
వెస్ట్ – రూ. 0.63 కోట్లు
గుంటూరు – రూ. 0.82 కోట్లు
కృష్ణా – రూ. 0.77 కోట్లు
నెల్లూరు – రూ. 0.36 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news