సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలిసిన విషయమే.. ఇక ఈయనకున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. నాలుగు సంవత్సరాల వయసులోనే నీడ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో చైల్డ్ యాక్టర్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చిన్న వయసులోనే డ్యాన్సులు, ఫైట్లు ,యాక్టింగ్ తో మహేష్ బాబు బాగా ఆకట్టుకుంటున్నాడు. ఇక రాజకుమారుడు సినిమా ద్వారా 1999లో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.
తన తొలి చిత్రంతోనే నంది అవార్డు అందుకున్నాడు. అయితే మహేష్ బాబు ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికి తన స్థానం సంపాదించడానికి చాలా కాలం పట్టింది అని చెప్పవచ్చు. అయితే యువరాజు సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో స్టార్ హోదాని అందుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ మహేష్ బాబు క్లాస్ లుక్ లో ఉండే సినిమాలు తీయడంతో మాస్ హీరో కాలేడని విమర్శలు కూడా చేయడం జరిగింది. అయితే మహేష్ అవేమీ పట్టించుకోకుండా కేవలం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్ చిత్రాలనే చేసుకుంటూ తన కెరీర్ ముందుకు సాగించాడు.
మురారి చిత్రంతో మహేష్ ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు. ఇక దీంతో తన స్టార్ మారిపోతుంది అనుకున్న సమయంలో కొన్ని సినిమాలు ఫ్లాప్ లు కారణంగా మహేష్ బాబు కెరీర్ అంద వికారం లోకి వెళ్ళిపోయింది. మహేష్ బాబు నటించిన ఒక్కడు చిత్రంతో తను మాస్ హీరో గా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ వెంటనే వచ్చిన నిజం చిత్రం ఫ్లాప్ ను చవి చూసింది. కానీ ఈ చిత్రానికి అవార్డు మాత్రం దక్కించుకుంది. ఇలా ఎంతో పెద్ద స్టార్ అయినప్పటికీ మహేష్ బాబు ఒకానొక సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాడు అన్న వార్తలు కూడా వినిపించాయి. ఇబ్బందుల నుంచి బాలకృష్ణ బయట పడేసాను అనే వార్తలు కూడా వినిపించాయి.డైరెక్టర్ కె రాఘవేంద్రరావు బ్యానర్లో శోభన్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం బాబీ.. ఒక్కడు సినిమా కంటే ముందు విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక డ్రైవర్ ఆర్తి అగర్వాల్ తో ఈ సినిమాలో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో డ్రైవర్ మీద చేయి చేసుకున్నారు మహేష్ బాబు.. ఆ సినిమాకి పని చేస్తున్న కొంత మంది జూనియర్ ఆర్టిస్టులు షూటింగులో పాల్గొన కుండా.. మహేష్ బాబు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడున్నవారంతా కంగారు పడడంతో అప్పుడే బాలకృష్ణ అక్కడికి వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. మహేష్ బాబు ఏ తప్పు చేయలేదని చెప్పి బాలకృష్ణ అక్కడ నుంచి తన కారులో ఎక్కించుకొని వెళ్లిపోయినట్లు గా సమాచారం.