విశ్వక్ సేన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

-

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం.. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ప్రాంక్ వీడియో హీరో విశ్వక్ సేన్ కు తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈ విష‌యంపై ఓ మీడియా ఛానల్ డిబేట్లో పాల్గొనగా అది కాస్తా గొడవలకు దారి తీసింది. వేలు చూపించి విశ్వక్ వార్నింగ్ తనను డిప్రెషన్ పర్సన్ పాగల్ సేన్ అని అనవద్దని లైవ్ డిబేట్ లోనే సదరు ఛానల్ యాంకర్ కు వేలు చూపించి మరీ హెచ్చరిక చేశాడు విశ్వక్ సేన్.

Danam Nagender Comments on Congress

దీంతో ఒక్కసారిగా యాంకర్ కు కోపంతో వెంటనే స్టూడియో నుంచి వెళ్లిపోవాలి అని .. అసహనంతో గెట్ అవుట్ అని కూడా అనడంతో విశ్వక్ సేన్ కు మరింత కోపంతో ఇంగ్లీష్ లో బూతులు మాట్లాడాడు. f** అంటూ యాంకర్ ముందే బూతులు మాట్లాడటంతో ఆమె మరింత గట్టిగా గెటవుట్ అంటూ విశ్వక్సేన్ పరువు పోయే విధంగా మాట్లాడింది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. మహిళల పట్ల‌ అసభ్యంగా ప్రవర్తించిన విశ్వక్ సేన్ సినిమాలను అడ్డుకుంటామని, విశ్వక్ సేన్ ఆ ఎఫ్ పదాన్ని వాడిన‌ప్పుడు టీవీ 9 యాంకర్ చెప్పుతో కోట్టాల్సిందంటూ దానం మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news