గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో ఖాలిగా ఉన్న 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్ లు విడుదల చేస్తోంది. ఇటీవల పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ తెలంగాణ సర్కార్.. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.. ఇప్పటికే గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ (TSPSC) మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.
త్వరలోనే 149 అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇండెంట్ టీఎస్‌పీఎస్సీకి చేరింది. బీటెక్ ఆటోమొబైల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు పూర్తిచేసినవారు ఏఎంవీఐ పోస్టులకు అర్హులు. అయితే పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.