కష్టం ఉంటే చలించిపోవడం మానవత్వం. సాయం చేసి రావడం మానవత్వం..మనిషి తత్వం. అసలు తోటి వారి సమస్యలన్నవి అర్థం చేసుకోకుండా ప్రవర్తించే నాయకులకు మాట్లాడే హక్కు ఉంటుందా? లేదా అన్నీ రాజకీయం చేయాలనుకునేవారికి ఓట్లడిగే నైతికత ఉంటుందా ? ఇవే ప్రశ్నలు ఇప్పుడు వెన్నాడుతున్నాయి. జనసేన పార్టీ రానున్న కాలంలో మరింతగా దూసుకుపోనుంది. అందుకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఓడిపోయినా గెలిచినా కూడా నేను మీ వెంటే ఉంటాను అని అంటున్నారు పవన్. ఈ మాటే ఆయన్ను జన హృదయ విజేతను చేయనుంది. ఇకపై ఆయన పోరు మరింత బలోపేతం కానుంది. ఆ విధంగా ఆయన కొత్త పంథా లో ప్రయాణించనున్నారు.
కౌలు రైతు భరోసా యాత్ర పేరిట ఇప్పటికే ఆయన అనంత దారుల్లో పర్యటించి వచ్చారు. ఎంతో పేరు తెచ్చుకున్నారు. బాధితులను పరామర్శించిన తీరు ప్రశంసలు అందుకుంది. వారి కష్టం చూసి చలించిన విధానం, అండగా ఉన్న వైనం మరోసారి పవన్ లో మానవతా వాదిని ప్రపంచం చూడగలిగింది. ముఖ్యంగా అనంత దారుల్లో కౌలురైతులు ఎందరున్నారు..వాళ్లలో ఎందరు మరణించారు అన్న డేటా కూడా ప్రభుత్వం దగ్గర లేదు. పవన్ తనకు తెలిసిన మార్గాలలో కొన్ని స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో వివరాలు సేకరించి, వారికి సాయం చేసి వచ్చారు.
ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున అందించి వచ్చారు. తనకు డేటా విషయమై సహకరించిన మాతృమూర్తులకు వందనాలు చెల్లించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు.
అక్కడా రాజకీయ విమర్శలే వచ్చాయి. భరించి ముందుకు వెళ్లారు. నిన్నటి వేళ కర్నూలు వాకిట 130 కుటుంబాలకు సాయం చేసి వచ్చారు. వీటిపై ప్రజల్లో మంచి అభిప్రాయం నెలకొంది ప్రశంసలు వస్తున్నాయి. విమర్శలు చేస్తే సంబంధిత పార్టీలకే నష్టం.పరువు పోవడం ఖాయం.. అని అంటోంది జనసేన అభిమాన వర్గం.