కొత్త వాహనాలు కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన లైఫ్ ట్యాక్స్‌

-

కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి బిగ్ షాక్. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా సామాన్యుడిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. వాహన కొనుగోలుదారుల పై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం మోపింది. వాహనాల జీవితకాల పనులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది.

లక్ష రూపాయల లోపు విలువచేసే ద్విచక్ర వాహనం కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు తొమ్మిది వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక నుంచి 12 వేల జీవితకాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే మూడు వేల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 10 లక్షల లోపు విలువచేసే కారును కొనుగోలు చేస్తే గతంలో సుమారు లక్ష ఇరవై వేల రూపాయల పన్ను రూపంలో చెల్లించేవారు.

ఇక నుంచి లక్షా 40 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అదనంగా 20 వేల రూపాయలు అదనంగా కట్టాల్సి ఉంటుంది సామాన్యుడు. ఇప్పటి వరకు అమలులో ఉన్న రెండు స్లాబ్ విధానాన్ని ప్రభుత్వం 4 స్లాబ్ లకు పెంచింది. వాహన విలువలను విభాగాలుగా విభజించి పన్నులను వసూలు చేయాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా సామాన్యుడిపై ఎక్కువగా భారం పడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news