మంగళవారం ఏ రాశి వారికి మంచి లాభాలు వస్తాయో చూడండి..

-

మే 10 న మంగళవారం రాశి ఫలాలు..

మేషం: చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు..ఈరోజు అనుకున్న పనులు పూర్తిగా నెరవేరుతాయి..దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న రుణాలు భాధ పెరుగుతుంది..

వృషభం: కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఫలితాలు రావు.. ఉద్యోగులకు అనుకున్న లాభాలు రావు. ఈరోజు ఈ రాశి వారికి పెద్దగా కలిసి రాదు.మంచి రోజు కాదు..

మిథునం: ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు. పాత బుణాలు తీరి ఊరట పొందుతారు. నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలిగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగం, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.స్థిర ఆస్తులు ఈరోజు కలిసి వస్తాయి.మంచి శుభవార్తలను వింటారు.

కర్కాటకం: ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది.ఆదాయం తక్కువ , ఖర్చులు అధికంగా ఉంటాయి.ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ఆరోగ్య సమస్యలు తలెత్త వచ్చును..

సింహం: బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి..బంధువుల తో చిన్న పాటి చికాకులు ఉంటాయి.. వృత్తి, ఉద్యొగాలలొ అనుకున్న ఫలితాలను అందుకుంటారు.

కన్య: ధన వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఈరోజు ఆదాయం తక్కువ ఖర్చులు అధికంగా ఉంటాయి.వేరే వాళ్ళ వ్యవహారం లో తల దూర్చ వద్దు.. లేని పోనీ తల నొప్పులు వస్తాయి.

తుల: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు.నిరుద్యోగులకు మంచి రోజు..ఈ రోజు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.దేవాలయాలను సందర్షిస్తారు.

వృశ్చికం: దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి గతం కంటే లాభా సాటిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటారు. మంచి లాభాలను పొందవచ్చు..

ధనస్సు: దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.ప్రయాణాలలో ఇబ్బందులు, ఆదాయం గతం కంటే ఎక్కువ వుంటుంది.విందు,వినోదాల లో పాల్గొంటారు..

మకరం: కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.కొంతవరకు మంచి రోజు..

కుంభం: ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పాత ఋణాలు తీరుతాయి. కొత్త బాధ్యతలు వస్తాయి.కొత్త ఇంటి నిర్మాణం చేస్తారు.

మీనం: సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి.ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు ఆలొచించాలి.ఈరోజు మంచి లాభాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news