కేసీఆర్ హెలిప్యాడ్ కోసం 300 చెట్ల నరికివేత.. రాములమ్మ సంచలన వ్యాఖ్యలు

-

సీఎం కేసీఆర్ హ‌రిత‌హ‌రం పేరుతో వేల చెట్ల‌ను నాటించిన‌ట్టు చెప్పుకుంటారని… కానీ ఆ సీఎం కారణంగానే ఒక ఉద్య‌ాన‌వ‌నం ధ్వంసం అవుతోందని ఫైర్ అయ్యారు విజయశాంతి. ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా వస్తారో రారో తెలియని సీఎం హెలీప్యాడ్​ కోసం నల్గొండ పట్టణంలో ఐదెకరాల్లో ఉన్న నీలగిరి నందనవనాన్ని ఆఫీసర్లు నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

దగ్గర్లో 150 ఎకరాల భూములున్నా… కేవలం జిల్లా కలెక్టరేట్ పక్కనే హెలిప్యాడ్​ ఉండాలనే ఒకే ఒక్క కారణంతో సుమారు 30 ఏండ్ల నాటి 300 చెట్లు నరికేస్తున్నారు… ఒక ఎకరం ఉంటే సరిపోయే హెలీప్యాడ్​ కోసం జనావాసాల మధ్య తెలుగు విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేటాయించిన రెండెకరాలు, ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​కు చెందిన మరో మూడెకరాలు స్వాధీనం చేసుకున్నరని మండిపడ్డారు విజయశాంతి.

నీలగిరి నందనవనంలోని మూడెకరాల్లో వేప, మద్ది, దిరిసెన తదితర చెట్లు పట్టణ ప్రజలను దశాబ్దాలుగా ఆహ్లాదపరుస్తున్నయి. కానీ కొద్దిరోజులుగా వీటితో పాటు తెలంగాణ హరితహారంలో భాగంగా ఈ ఆవరణలో లక్షలు ఖర్చుపెట్టి నాటిన మొక్కల్ని కూడా తొలగిస్తున్నారని అగ్రహించారు. హెలీప్యాడ్​ నిర్మించడానికి పట్టణ పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో ఖాళీ స్థలం ఉంది. ఎస్ఎల్​బీసీ వద్ద సుమారు 150 ఎకరాలుండగా, దీంట్లో ప్రభుత్వ భవనాలకు వంద ఎకరాలు కేటాయించారన్నారు విజయశాంతి. అయినప్పటికీ ఇందులో ఇంకా 50 ఎకరాల వరకు ఖాళీగా ఉంది. కానీ నీలగిరి నందనవనాన్ని నరికేసి అక్కడే హెలీప్యాడ్ నిర్మించడానికి అధికారులు మొగ్గు చూపుతున్నరు. హ‌రిత‌హ‌రంతో ఎంతో చేశామ‌ని చెప్పుకునే కేసీఆర్ దగ్గర దీనికి జవాబుందా? ఇప్ప‌టికైనా ఈ విధ్వంస కాండ‌ను ఆపాలని డిమాండ్ చేశారు విజయశాంతి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news