నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం..జగన్

-

 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా.. ఆయన తనయుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ విగ్రవాహనికి నివాళులర్పించారు. ‘ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా అన్నవరం శివారులో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మహానేత విగ్రహానికి పైలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ‘ఈ సందర్భంగ నాన్నను గుర్తుచేసుకుంటున్నాను… నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం.. ఆయన ఆశయ సాధన కోసం జీవితాన్ని త్యాగం చేస్తాను’ అని ట్విట్టర్ వేదికగా ఆయన వైఎస్ఆర్ ని స్మరించుకున్నారు.

 

కడప జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, వారి కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, ఆయన ఆశయ సాధన జగన్ వల్లే సాధ్యమని రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని బిడ్డలా ఆదరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news