అయ్యో.. యాసిడ్‌ తాగి యువతి సూసైడ్‌.. యువకుడి వేధింపులే కారణం..

-

ఓ యువకుడు వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడని ఓ యువతి యాసిడ్ తాగి సూసైడ్ చేసుకుంది. ఆదిలాబాద్ తలమడుగు మండలంలోని రుయ్యడి గ్రామనికి చెందిన కుమ్మరి శ్రీనీల(19)ని అదే గ్రామానికి చెందిన చిన్నాల సాయి అనే ఓ యువకుడు కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఈ విషయం శ్రీనీల ఇంట్లో తెలిసి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.

అయితే సాయి శ్రీనీలకి వచ్చే సంబంధాలని చెడగొడుతున్నాడు. సాయి తనకి వచ్చే సంబంధాలన్నీ చెడగొడుతున్నాడని, ప్రేమిస్తున్నాను అంటూ వేధిస్తున్నాడు అని మనస్తాపంతో ఆ యువతి ఇంట్లోని యాసిడ్ తాగి ఆత్మహత్యకి ప్రయత్నించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news