సర్కారు వారి పాట సినిమా కి మహేష్ పారితోషకం అన్ని కోట్లా..?

-

పరుశురాం దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా ఈ రోజు అనగా మే 12వ తేదీన రిలీజ్ అయి మొదటి షో తోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంటోంది. ఇకపోతే నిన్నటివరకూ ప్రమోషన్స్ లో పాల్గొన్న మహేష్ బాబు తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ పై తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించి ఒక రకంగా జాతీయ మీడియాకు షాకిచ్చారు. ఇక తన కెరీర్ మొత్తం తెలుగు పరిశ్రమకే అంకితం చేస్తానని చెప్పి తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించారు మహేష్ బాబు.

ఇకపోతే మహేష్ బాబు నటించిన గత మూడు సినిమాలు కూడా భారీ విజయం సాధించడంతో పాటు సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందని.. ఇప్పటికే అందరూ అనుకోవడం.. నైజాం లో ఈ సినిమాకు 7 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా .. ఓవర్సీస్ లో రూ. 5 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంతేకాదు నిన్నటి వరకు ఈ చిత్రం సుమారుగా రూ. 130 కోట్ల పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసింది. దీంతో సినిమాపై ప్రతి ఒక్కరికి భారీ అంచనాలు నెలకొనడం గమనార్హం. మహేష్ బాబు నిర్మిస్తున్న మేజర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. అంతే కాదు తనను బాలీవుడ్ ఇండస్ట్రీ భరించలేదని.. అందుకే అక్కడ సినిమాలు చేయడం లేదని కూడా చెప్పాడు.

తాజాగా సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ బాబు ఎంత తీసుకున్నాడు అనే విషయానికి వస్తే… సుమారుగా రూ. 35 నుంచి 50 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒకవేళ రూ. 30 కోట్లకే ఆయన పారితోషకం ఆగి ఉంటే సినిమా లాభాలలో ఖచ్చితంగా ఆయన వాటా తీసుకుంటాడు అని కూడా టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మహేష్ బాబుకు సర్కారు వారి పాట సినిమా ద్వారా రూ. 50 కోట్లకు పైగా పారితోషికం అందినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news