పురాతన జీవిని కనుగొన్న ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు.. ఆ జీవికి ఎన్ని కాళ్లు ఉన్నాయో తెలుసా..!

-

శాస్త్రవేత్తలు అంటేనే..నిజాన్ని కనిపెట్టడం..మిస్టరీలను ఛేదించటం..అరుదైనవాటిని కనుక్కోవటం. తాజాగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు 1306 కాళ్లు ఉన్న అరుదైన జీవిని కనుగొన్నారు. ఇది ఒక రకమైన మిల్లిపేడ్. ప్రపంచంలో వెయ్యికి పైగా కాళ్లు ఉన్న ఏకైక జీవి ఇది. ఇది భూమికి 200 అడుగుల దిగువన ఉన్నట్లు వాళ్లు గుర్తించారు. ఇంకా ఈ జీవిలో ఉన్న ప్రత్యేకత ఏంటో చూద్దాం.

ఇది 95.7 మిల్లీమీటర్ల పొడవు.. యూఎస్బీ(USB) కేబుల్ లాగా సన్నగా ఉంటుందట. నిపుణులు ఈ జీవికి ‘యుమిలెప్స్ పెర్సెఫోన్’ అని పేరుకూడా పెట్టారు. ఈ జాతి 400 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఉండేది. పెర్సెఫోన్ కంటే ముందు, కాలిఫోర్నియాలో ఎక్కువ కాళ్లు ఉన్న జంతువు కనుగొన్నారు. దానికి 750 కాళ్లు ఉండేవి. అది కూడా మిల్లీపెడ్‌. దాని పేరు ఎలెక్మీ ప్లానిప్స్. ఆ జంతువు మొదటిసారి 1980లో కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

మిల్లిపేడ్ అంటే వెయ్యి అడుగుల అని అర్థం. పూర్వ కాలంలో చాలా ఎక్కువ కాళ్ళతో ఉన్న జీవులను వెయ్యి కాళ్ళు లేకపోయినప్పటికీ వేయికాళ్ళ జంతువుగా పిలిచేవారు. అందుకే వాటికి మిల్లిపాడ్ అని పేరు పెట్టారు. అయితే, యుమిలెప్స్ పెర్సెఫోన్ 1000 లేదా అంతకంటే ఎక్కువ కాళ్ళను కలిగి ఉన్న మొదటి మిల్లిపేడ్. శాస్త్రవేత్తల ప్రకారం, పెర్సెఫోన్ అనే పదం గ్రీకు పురాణాల నుండి తీసుకున్నారు. దీని అర్ధం పాతాళానికి రాణి అని. ఈ జీవిని భూమిలో చాలా కింది నుంచి గుర్తించడంతో దీనికి ఆ పేరు పెట్టారట. మిల్లిపెడెస్‌కు కళ్ళు ఉండవు. మిల్లిపెడెస్ ఫంగస్‌పై జీవిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని శాస్త్రవేత్తలు రెండు ఆడ, రెండు మగ మిల్లిపెడ్‌లను కనుగొన్నారు. ఆడ మిల్లీ పైడ్స్ కాళ్ల సంఖ్య 1306,998. మగ మిల్లిపెడెస్‌కు 818, 778 కాళ్లు ఉన్నట్లు వెల్లడించారు. శాస్త్రవేత్తల చెబుతున్న దాని ప్రకారం, మొదట కనుగొన్న పెడ్స్ 400 మిలియన్ సంవత్సరాల క్రితం కనిపెట్టారు. ఇప్పుడు వాటి జాతుల సంఖ్య 13,000 అయింది.

అసలు ఇన్ని కాళ్లు ఎందుకు?

పెర్సెఫోన్ కాంతి లేదా తగినంత ఆహారం లేని ప్రపంచంలో నివసిస్తుంది కాబట్టి… ఈ జీవి భూమికింద బతకాలంటే ఇన్ని కాళ్లు ఉండాల్సిందే అంటున్నారు శాస్త్రవేత్తలు. మిల్లీ పెడ్ యొక్క పొడవు మరియు పొట్టి కాళ్లు కదలడాన్ని సులభతరం, అనువైనవిగా చేస్తాయి…భూమి కింద దొరికే వీటికి ఆహారం లేకపోవడంతో శరీరంలోని ఇతర భాగాలు అభివృద్ధి చెందవు. ఈ జీవి వలన పర్యావరణానికి ఏమైనా హానికరమా లేదా అనేది వెల్లడికాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news