ప్రతి పని చేయడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని నిర్ణయించేది పంచాంగం. సూర్యచంద్రుల మధ్య దూరాన్ని సగం చేస్తే కరణం ఏర్పడుతుంది. అంటే తిథిలో సగభాగమే కరణం. ఈ కరణాలు మొత్తం 11 ఉన్నాయి. వీటిలో కొన్ని స్థిరకరణాలు, మరికొన్ని చరకరణాలు. ఈ కరణాలన్నింటిలో కూడా చేయదగిన ఆయా పనులు స్పష్టంగా చెప్పబడ్డాయి.
ఉదాహరణకు బవకరణంలో శుభకార్యాలు, స్మార్తకర్మలు చేయవచ్చు. అలాగే బాలువ కరణంలో అన్నప్రాశన, వాస్తు క్రియలు మొదలైనవి చేస్తే మంచిది. ఇక ఆలస్యమెందుకు మీ కార్యాలను ప్రారంభించే ముందు మీకు తెలిసిన పండితుడు దగ్గరికి వెళ్లి మంచి యోగాలను, కరణాలను తెలుసుకోండి.
– కేశవ