సంచలన నిర్ణయం.. ఇక నుంచి అక్కడ బుర్ఖాలు వేసుకోవద్దు..!

-

అవును.. నిజంగా ఇది షాకింగే. ఆ దేశంలో ఇక నుంచి బుర్ఖాలు వేసుకోకూడదు. ఫేస్ కనిపించకుండా ఏ వస్త్రాన్నీ కట్టుకోకూడదు. ఇది ఒక్క మహిళలకే కాదు.. అందరికీ వర్తిస్తుంది. కుల, మత, ప్రాంత బేధం లేకుండా.. అందరూ ఈ నిబంధనను ఫాలో అవ్వాల్సిందే. అయితే.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఇంతకీ.. ఎక్కడ అంటారా?

Burkas banned in srilanka

బాంబు పేలుళ్ల మోతతో దద్దరిల్లిపోయిన శ్రీలంక దేశంలోనే. శ్రీలంకలో ఈస్టర్ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 320 కి పైగా మృతి చెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ శ్రీలంక కోలుకోలేదు. ఇంకా శ్రీలంక మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్న కాక మొన్న సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చేసుకున్నారు. దీంతో శ్రీలంకలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అంతా టెన్షన్ తో ఉన్నారు.

ఈనేపథ్యంలోనే శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. దేశ వ్యాప్తంగా ఎవరు కూడా ఈరోజు నుంచి అంటే ఏప్రిల్ 29 నుంచి బుర్ఖా ధరించొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ముసుగు చాటున దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని… అందుకే… శ్రీలంకలో వినాశనం సృష్టించిన ఉగ్రవాదుల ఆట కట్టాలంటే.. ప్రజలంతా ఈ నిబంధనను పాటించాలని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు. అయితే.. ఈ నిర్ణయాన్ని ముస్లిం పెద్దలు కూడా స్వాగతించారు.

Read more RELATED
Recommended to you

Latest news