లోక్‌సభ ఎన్నికల మూడోవిడత పోలింగ్ తేదీ సమీపించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై ఆరోపణలకు మరింత పదును పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్‌లోని దర్భంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ గోద్రా అల్లర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన గోద్రా ఘటనను ప్రస్తావించారు.
2002లో జరిగిన గోద్రా రైలు దహన ఘటనలో 60మందికిపైగా కరసేవకులను సజీవంగా కాల్చిచంపిన నిందితులను కాపాడేందుకు అప్పటి రైల్వే శాఖ మంత్రి, ఇప్పటి ఆర్జేడీ అధ్యక్షుడు లాలుప్రసాద్ యాదవ్ ప్రయత్నించినట్లు మోదీ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు గోద్రా ఘటన జరిగిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి కూడా బుజ్జగింపు రాజకీయాలే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. దీ, దేశంలో అవినీతికి పాల్పడినవారు వచ్చే ఐదేళ్లలో పర్యవసానాలను అనుభవిస్తారని హెచ్చరించారు.