హోం మంత్రి అమిత్ షా ఓ టూరిస్ట్ – మంత్రి సబితా సంచలనం

-

అమిత్ షా టూరిస్ట్ లాగా వచ్చి పోతా అంటే కుదరదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్‌ అయ్యారు. తెలంగాణ కు ఒక్క విద్య సంస్థ ఇవ్వలేదని చెప్పడానికి అమిత్ షా వస్తున్నారా ? అని నిలదీశారు. సంవత్సరంకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి హామీ ఇచ్చింది…ఎక్కడ ఉన్నాయి ఆ ఉద్యోగాలు ? తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ కు ఇస్తామని చెప్పిన ఒక సంస్థను కేంద్రం గుజరాత్ కు తీసుకుపోయిందని.. అమిత్ షా గ్యాస్ ,డీజిల్ ,పెట్రోల్ ధరలను తగ్గిస్తామని తెలంగాణ పర్యటన లో అమిత్ షా చెప్పాలని డిమాండ్‌ చేశారు సబితా ఇంద్రారెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉర్దూ లేదా ? బిజెపి నేతలు సమాధానం చెప్పండి ? అని నిలదీశారు.

కేంద్రం నుంచి ఏమి తీసుకువచ్చారో బండి సంజయ్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏ మొఖం పెట్టుకుని అమిత్ షా రంగారెడ్డి జిల్లాకు వస్తున్నారు ? రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కి కేంద్రం ఏమి చేసింది ? అని ఫైర్‌ అయ్యారు. బిజెపి ఒకటి రెండు సీట్లకు పరిమితం అవుతుందని ఎద్దేవా చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news