ఈ నెల 22 వరకు సెలవులు లేవు

-

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు వేసవి సెలవులు ఇవ్వకుండ పని చేయిస్తున్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల ఉపాధ్యాయులకు ఈ నెల 22 వరకు సెలవులు లేవని సమగ్ర శిక్ష అభియాన్ ప్రకటించింది. ఉపాధ్యాయులందరికీ వేసవి సెలవులు ఇవ్వగా.. ప్రవేశాల పేరుతో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల ఉపాధ్యాయుల పనిదినాలను పొడిగించారు. విద్యార్థినుల ప్రవేశాల కోసం సిబ్బంది ప్రచారం చేయాలని పై అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా.. 100 శాతం ప్రవేశాలు సాధించాలని అధికారుల నుంచి టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. వేసవి సెలవులను రద్దు చేయడంతో ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh: Govt. plans to enhance quality education in KGVBs across  the state

Read more RELATED
Recommended to you

Latest news