సన్నగా ఉన్నా పొట్ట ఎక్కువగా ఉందా.. ఈ డ్రింక్ తో కొవ్వు కరిగించేయండి..!

-

ఈ మధ్య చాలామంది.. బరువు పెద్దగా ఉండకపోయినా.. పొట్ట మాత్రం విపరీతంగా ఉంటుంది. అంటే సన్నగా కనిపిస్తారు కానీ.. పొట్ట ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం.. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా.. ఒకే దగ్గర గంటల తరబడి కుర్చోని వర్క్ చేయడం, బాడీకి అసలు శారీరక శ్రమ ఇవ్వకపోవడం కావొచ్చు. పాపం చూడ్డానికి ఏమంత బరువు ఉండరు కానీ.. పొట్ట విషయం వచ్చే సరికి ఎక్కువగా ఉంటుంది. దీనికోసం డైట్ చేస్తే.. అసలే సన్నగా ఉంటారు.. ఇంకా తినడం తగ్గిస్తే ఎండిపోతారు. మరి ఏం చేయాలి..? అసలైతే డైలీ 30 నిమిషాలైనా ఎక్సర్ సైజ్ చేస్తే ఏ బాధ ఉండదు. కానీ మనకు అంత టైం, ఓపిక రెండూ ఉండవు.. అందుకే.. పొట్టలో పేరుకుపోయిన కొవ్వును వెన్నలా కరిగించే ఓ చిట్కా మీకోసం తెచ్చాం.. దీంతో..నాజూకైన నడుము మీ సొంతం. బాడీలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ అంతా ఈ డ్రింక్ ద్వారా తగ్గించుకోవచ్చట.
జీలకర్ర, సోంపు, ధనియాలు, కొత్తిమీర కాంబోతో బరువు తగ్గించే పానీయాన్ని సిద్ధం చేయవచ్చు. దీని కోసం ఒక గ్లాసు నీటిలో ఈ మూడు మసాలా దినుసులను ఒక చెంచా తీసుకొని రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే తక్కువ మంటపై మరిగించి అందులో కొత్తిమీర వేసి వడగట్టి తాగాలి. మీరు ఈ పానీయానికి నిమ్మ, నల్ల ఉప్పును జోడిస్తే.. దీని ప్రభావం ఇంకా మెరుగ్గా మారుతుంది.
జీలకర్ర ప్రయోజనాలు..
జీలకర్ర మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం, కాపర్, ఐరన్, మాంగనీస్, జింక్, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. దీంతోపాటు విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి మరియు విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉన్నాయి. జీలకర్ర తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గడానికి ఇదే కారణం.
 సోంపు ప్రయోజనాలు..
సోంపు తినడం ద్వారా శరీరానికి ఖనిజాలు, విటమిన్లు బాగా అందుతాయి. ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. ఈ మసాలా దినుసులో మంచి మొత్తంలో ప్రోటీన్ లభిస్తుంది. ముఖ్యంగా ఒక టీస్పూన్ ఫెన్నెల్‌లో 20 కేలరీలు, 1 గ్రాము ప్రోటీన్, 3 గ్రాముల పిండి పదార్థాలు, 2 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇది జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది.
ధనియాల ప్రయోజనాలు..
ధనియాల్లో క్రిమినాశక లక్షణాలు బోలెడు ఉన్నాయి. ఇది శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుంది. దీంతోపాటు ముఖంపై అద్భుతమైన గ్లోను కూడా తెస్తుంది. ధనియాలు రక్తంలో చక్కెర స్థాయిని, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. కొత్తిమీరలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళకు చాలా మేలు చేస్తుంది.
దీన్ని మీరు డైలీ తాగక్కర్లేదు. వారానికి నాలుగు లేదా ఐదు రోజులు చొప్పున మూడు వారాలు తాగితే.. మార్పు కనిపిస్తుంది. అప్పుడు వారానికి కనీసం మూడు రోజులు తాగుతూ ఉంటే.. పొట్టు ఎప్పుడు సన్నగా ఉంటుంది. ఇంకోటి.. ఈ డ్రింక్ తాగినప్పుడు వాటర్ ఎక్కువగా తాగాలి.. లేదంటే బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. కాబట్టి వాటర్ తాగడంలో అస్సలు లేట్ చేయొద్దంటున్నారు నిపుణులు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news