శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపు దాలుస్తోంది. రాజకీయ మార్పు జరిగిన పరిస్థితుల్లో ఏం తేడా లేదు. దేశ ప్రజలు త్యాగాలకు సిద్ధం కావాలంటూ కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ ను ప్రైవేటీకరణ చేయాల్సిందే అని ప్రధాని విక్రమసింఘే అన్నారు. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత నుంచి అత్యంత దారుణమైన సంక్షోభాన్ని శ్రీలంక ఇప్పుడు ఎదుర్కొంటోంది.
గత ప్రధాని మహిందా రాజపక్సే శ్రీలంక ఎయిర్ లైన్స్ లో మేనిజింగ్ షేర్ హోల్డర్ గా ఉన్న ఎమిరేట్స్ ను తొలగించాడు. అప్పటి నుంచి శ్రీలంక ఎయిర్ లైన్ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. 2020-21లో 45 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తే…2021 మార్చి 31 నాటికి ఎయిర్ లైన్స్ నష్టాలు 372 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రైవేటీకరణ చేసిన నష్టాలను భరించాల్సి ఉంటుందని రణిల్ విక్రమసింఘే తెలిపారు. 1979లో ప్రారంభించబడిన శ్రీలంక ఎయిర్‌లైన్స్ 61 దేశాలలో 126 గమ్యస్థానాలకు గ్లోబల్ రూట్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.