ఇటీవల కాలంలో కొంతమంది బాగా పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత వివాహం చేసుకుంటే.. మరికొంతమంది అసలు వివాహానికి దూరంగా ఉంటూ వస్తున్నారు . ఇక ఇటీవల బిగ్ బాస్ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ముద్దుగుమ్మ అలియాస్ బుల్లితెర యాంకర్ అరియానా తాజాగా వివాహం చేసుకోబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈమె కెరియర్లో బిగ్ బాస్ షో వల్ల ఎన్నో కీలక మలుపులు చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. బిగ్బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ లకు గట్టిపోటీ ఇవ్వడంతో పాటు మరింత అభిమానులను సొంతం చేసుకుంది.
ఇక కొన్ని విషయాలలో ఈమె చాలా బోల్డ్ గా ఉంటుంది అని అందరూ విమర్శించినా.. ఈమెను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇక ప్రస్తుతం నాన్ స్టాప్ బిగ్ బాస్ ఓటీటీ లో కంటెస్టెంట్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రతి సీజన్లో కూడా ఆస్ట్రాలజర్ ను పంపి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సెలబ్రిటీల జాతకాల గురించి వెల్లడిస్తారు అన్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సీజన్ లో కూడా శాంతి అనే ఒక ఆస్ట్రాలజర్ ఎంట్రీ ఇచ్చి తన జాతకం గురించి చాలా గొప్పగా చెప్పింది. ఇక ఈమె జాతకం చాలా అద్భుతంగా ఉంది అని ఫుల్ సెలబ్రేషన్స్లో తన లైఫ్ ఉండబోతోంది అని శాంతి తెలిపింది. అంతేకాదు నవంబర్ నెలలో పెళ్లి జరిగే అవకాశం కూడా ఉంది అని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి కూడా సిద్ధంగా ఉన్నాడు అని తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. అంతేకాదు బిగ్ బాస్ షో తర్వాత కొత్త ఇల్లు , కొత్త జీవితం ఈమె కోసం సిద్ధంగా ఉన్నాయని కూడా శాంతి తెలిపింది. అయితే ఈ విషయంపై అరియానా ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.