ముగిసిన ఢిల్లీ బ్యాటింగ్‌.. ముంబాయి టార్గెట్‌ 160

-

ఐపీఎల్ తాజా సీజన్ లీగ్ దశలో నేడు చివరి మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబాయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముంబాయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబాయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబాయి ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించాలన్న ఢిల్లీ ఆశలు నెరవేరలేదు. బుమ్రా 3 వికెట్లు తీయగా, రమణ్ దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. డేనియల్ శామ్స్ 1, మయాంక్ మార్కండే 1 వికెట్ తీశారు.

IPL 2022 Live Score MI vs DC: Ishan Kishan gets going in Mumbai Indians'  160 chase | Hindustan Times

ఢిల్లీ బ్యాటింగ్ చూస్తే… 43 పరుగులతో రోవ్ మాన్ పావెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. పావెల్ 34 బంతులాడి 1 ఫోర్, 4 సిక్సులు బాదాడు. అంతకుముందు, ఓపెనర్ పృథ్వీ షా 24, కెప్టెన్ రిషబ్ పంత్ 39 పరుగులు చేశారు. ఆఖర్లో అక్షర్ పటేల్ 10 బంతుల్లో 2 సిక్సుల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరతారన్న నేపథ్యంలో ఢిల్లీ బౌలర్లు ముంబాయిని ఏ మేరకు కట్టడి చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news