ఇటీవల కాలంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ..వరుసగా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ ను రీమేక్ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే వారు బాక్సాఫీసు వద్ద సక్సెస్ అవుతున్నారు కూడా. కాగా, ఒరిజినల్ స్టోరిలు కాకుండా రీమేక్స్ చేయడం సరి కాదనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అలా సౌతిండియన్ లాంగ్వేజెస్ సినిమాలను రీమేక్ చేయకుండా ఒరిజినల్ స్టోరిస్ తోనే ఫిల్మ్స్ చేయాలనే విషయమై కొందరు చర్చిస్తు్న్నారు.అలా సౌత్ వర్సెస్ నార్త్ అనే చర్చ జరుగుతున్నది. కాగా, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో..ఖిలాడీ అక్షయ్ కుమార్ ఈ విషయమై స్పందించారు. సౌత్ రీమేక్స్ పైన తన అభిప్రాయం తెలిపారు.
సౌత్ ఇండియన్ మూవీస్ రీమేక్ చేయడంలో తప్పులేదని అన్నారు. తన సినిమాను తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టారని, తాను సౌత్ ఫిల్మ్ ‘విక్రమార్కుడు’ను ..‘రౌడీ రాథోర్’గా హిందీలో రీమేక్ చేసి సక్సెస్ అయ్యానని గుర్తు చేసుకున్నారు. అలా రీమేక్ చేయడంలో తప్పు లేదని, బాగుంటే హక్కులు కొని రీమేక్ చేస్తామని చెప్పుకొచ్చారు అక్షయ్.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటేనని, ఇలా సౌత్, నార్త్ అని విడిపోవడం మంచిది కాదని, బ్రిటీష్ వాళ్లు ఈ విధంగానే విడగొట్టి మనల్ని పరిపాలించారని వివరించారు అక్షయ్. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్రను ఆధారంగా తెరకెక్కిన ‘పృథ్వీరాజ్ ’సినిమాలో హీరో అక్షయ్ కుమార్, కాగా, హీరోయిన్ మానుషి చిల్లర్. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 3న విడుదల కానుంది. ఈ పిక్చర్ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.