పుట్టిన రోజు వేడుకలు కాస్త విషాదంగా మారాయి. అది కేవలం బర్త్‌డే బంప్స్ కారణంగా. ఇంతకీ మీకు బర్త్‌డే బంప్స్ అంటే తెలుసా? బర్త్‌డే బంప్స్ అంటే బర్త్‌డే బాయ్‌ని పట్టుకొని నాలుగు తన్నులు తన్నడమన్నమాట. కాకపోతే అది శృతి మించదు. ఇక్కడ శృతి మించింది… బర్త్‌డే బాయ్ ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన ఓ కాలేజీ హాస్టల్‌లో జరిగినట్టు తెలుస్తోంది.
బర్త్‌డే వేడుకలు జరుగుతుండగా.. ఆ వ్యక్తి ఫ్రెండ్స్ అంతా ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడ్డారు. పిడి గుద్దులు గుద్ది మనోడిపై ఉన్న కసినంతా తీర్చుకున్నారు. దీంతో అతడికి కడుపునొప్పితో పాటు… క్లోమ గ్రంథి దెబ్బతిన్నది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన రెండు నెలల కింద జరిగిందట. కాకపోతే.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
A student of IMM died last 2 months ago Reason was, on his B-Day, b’day bumps were given by friends.. Next day he had stomach ache, pancreas was damaged, operated Finally died
Pls ask children, not to give B-Day bumps… @rsprasad need law? @DoJ_India pic.twitter.com/yuhvstfDIq— SHRUTI DESAI ?? (@aakuraj) May 1, 2019