ఈ సారి భారీ స్థాయిలో హీరోగా పరిచయం అవుతున్న సునీల్..!!

-

ప్రముఖ స్టార్ కమెడియన్ సునీల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కమెడియన్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన సునీల్ ఆ తరువాత ఎన్నో విజయవంతమైన చిత్రాలలో.. స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా నటించి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక సిల్వర్ స్క్రీన్ పై హీరోగా మెరిసిన ఈయన కలర్ ఫోటో, పుష్ప సినిమాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరిని అలరించాడు. ఇప్పుడు మళ్ళీ F3 చిత్రంలో తన లో ఉన్న పాత కమెడియన్ ను బయటకు తీసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి ప్రయత్నాలు సిద్ధం చేస్తున్నాడు సునీల్.

ఇకపోతే సునీల్ మళ్లీ కమెడియన్ గా తన కెరియర్ స్టార్ట్ చేసినట్టేనా లేక మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అని అంతటా చర్చ నడుస్తోంది. ఇకపోతే గతంలో అందాల రాముడు , మర్యాద రామన్న లాంటి సినిమాలతో హీరోగా సక్సెస్ అయిన సునీల్ మళ్లీ ఎఫ్3 సినిమాతో కమెడియన్గా ఫుల్ లెంత్ రోల్ పోషించడానికి రెడీ అయ్యాడు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలో తాను హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపి అభిమానులకు హర్షం కలిగించాడు. సునీల్ ఒక మంచి ప్రాజెక్టుతో హీరోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఇకపోతే ప్రస్తుతం సునీల్ చేసిన ఈ కామెంట్లు కాస్త నెట్టింట బాగా చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ సారి కాస్త బడ్జెట్ పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం చేశాడు సునీల్. దాదాపుగా 10 సంవత్సరాలకు పైగా కమెడియన్ గా అలరించిన ఈయన క్యారెక్టర్ ఓరియంటెడ్ రోల్స్ లో నటిస్తూ మెప్పిస్తూ మళ్ళి తనలో ఉన్న హీరో ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే విషయం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news