ఇటాలియన్ కళ్ళజోడు తీసి చూడాలంటూ రాహుల్ గాంధీకి హోంమంత్రి అమిత్ షా కౌంటర్

-

రాహుల్ గాంధీ లండన్ లో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఇటాలియన్ కళ్ళజోడు తీసి అభివృద్ధిని చూడాలని ఎద్దేవా చేశారు. రెండు రోజుల అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో సంసాయ్ జిల్లాలో రూ. 1000 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు అమిత్ షా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గత ఎనిమిదేళ్లలో ఏం జరిగిందో కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. వారు అంతా కళ్లుమూసుకుపోయి ఉన్నారు. రాహుల్ బాబా ఇటాలియన్ కళ్ళజోడు తీసేసి పీఎం మోడీ, సీఎం పెమా ఖండూ చేసిన అభివృద్ధి చూడాలి.” అని అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు శాంతిభద్రతల బలోపేతం తోపాటు టూరిజం రంగాన్ని ప్రోత్సహించేందుకు చాలా చేశామని చెప్పారు. గత యాభై ఏళ్లలో జరగనిది ఎనిమిది ఏళ్లలో బిజెపి ప్రభుత్వం చేసింది అని ఉద్ఘాటించారు. కాగా ఆదివారం ఉదయం ఆయన బంగారు పగోడా ను సందర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news