చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాదం జరిగింది. దక్షిణ భారతదేశ భాషల్లో 200కు పైగా పాటలు పాడిన ప్రముఖ సింగర్ సంగీత సజిత్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం కేరళలోని తిరువనంతపురంలో ఆమె తుది శ్వాస విడిచారు.
గత కొంత కాలంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. తిరువనంతపురంలోని తన సిస్టర్ రెసిడెన్స్ లో ఉన్న ఆమె పరిస్థితి విషమించి కన్నుమూశారు. ప్రముఖ నేపథ్య గాయనిగా ఆమె మంచి పేరు సంపాదించుకుంది.
దక్షిణ భారత దేశ భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అనేక పాటలు పాడిన ఆమెకు ఎంతో మంది అభిమానులున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకుని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె అభిమానులు ఈ బాధాకర వార్త తెలుసుకుని సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు.
తిరువనంతపురంలోని థైకాడ్ శాంతిక వాదం శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. మాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్, స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కురుతి’ చిత్రంలోని థీమ్ సాంగ్ ను ఆమె చివరగా ఆలపించింది. ఏ.ఆర్.రెహన్ సంగీత దర్శకత్వం వహించిన ‘మిస్టర్ రోమియో’ సినిమాలో ‘తన్నెరై కథలిక్కుమా’ సాంగ్ ను గాయని సంగీత ఆలపించగా, ఆ సాంగ్ సూపర్ హిట్ అయింది.