తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు మీషో.. దావోస్‌లో కేటీఆర్‌ దూకుడు

-

దావోస్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సులో రెండో రోజైన సోమ‌వారం తెలంగాణ బృందం స‌త్తా చాటింది. సోమ‌వారం ఒకే రోజు రెండు సంస్థ‌ల‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ బీమా సంస్థ స్విస్‌రేతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ… తాజాగా ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ మీషోతో రెండో ఒప్పందాన్ని కుద‌ర్చుకుంది. తాజా ఒప్పందం ప్ర‌కారం మీషో సేవ‌లు ఇక‌పై తెలంగాణ‌లోని ద్వితీయ శ్రేణి ప‌ట్ట‌ణాల‌కు కూడా విస్త‌రించ‌నున్నాయి. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే మీషో సంస్థ హైద‌రాబాద్‌లో త‌న కార్యాల‌యాన్ని ప్రారంభించ‌నుంది. ఇప్ప‌టిదాకా ఈ సంస్థ సేవ‌లు న‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమితమ‌య్యాయి.

Image

తెలంగాణ ప్ర‌భుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేర‌కు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి ప‌ట్ట‌ణాల‌కు కూడా ఈ సంస్థ సేవ‌లు అంద‌నున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో మీషో సంస్థ‌, రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య ఒప్పందం కుదిరింది. దీంతో పాటు.. రిటైల్ రంగంలో అంత‌ర్జాతీయంగా స‌త్తా చాటుతున్న లులూ గ్రూప్‌తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేర‌కు దావోస్‌లో తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో లులూ సంస్థ‌తో రాష్ట్ర అధికారులు ఒప్పందం కుద‌ర్చుకున్నారు.

హైప‌ర్ మార్కెట్లు, మ‌ల్టీ ప్లెక్స్‌ల నిర్మాణంలో దిగ్గ‌జ కంపెనీగా పేరుగాంచిన లులూ గ్రూప్ యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ రాజ‌ధాని అబూ దాబి కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. దావోస్ స‌ద‌స్సులో తెలంగాణ పెవిలియ‌న్ వ‌చ్చిన ఆ సంస్థ సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. చ‌ర్చ‌ల అనంత‌రం ఇరు వ‌ర్గాల మ‌ధ్యం ఒప్పందం కుద‌ర‌గా… ఈ ఒప్పందం ప్ర‌కారం తెలంగాణ‌లో లెలూ గ్రూప్ రూ.500 కోట్ల పెట్టుబ‌డిని పెట్ట‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news