తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి విపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించుకుంటేనే ఉన్నారు. అయితే తాజాగా ఎమెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల నాయకులకు కేసీఆర్ అవకాశం ఇస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రాజ్యాన్ని ఏలాలని కొంతమంది భావిస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కులం, మతం ఎత్తుకొని సమాజంలో చీడపురుగుల్లాగా ఉన్నారని మండిపడ్డారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.
రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ను వేలానికి పెట్టారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కులాల, మతాల మధ్య రేవంత్ రెడ్డి చిచ్చుపెట్టే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేస్తేనే గెలుపు ఉంటుందని, కులాలతో మతాలతో గెలిచిన చరిత్ర లేదన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి.. కులాల మధ్య చిచ్చుపెట్టడం రేవంత్ రెడ్డికి తగదన్నారు. టీఆర్ఎస్‌లో కులాలు, మతాల పంచాయితీ లేదన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.