తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆజానుబాహుడు గా.. ప్రజల గుండెల్లో అన్నగారిగా చిరస్థాయిగా మిగిలిపోయిన స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా రాజకీయ పరంగా కూడా ఉన్నత స్థాయికి చేరుకున్నారు.
ఇక సాంఘిక, పౌరాణిక , జానపద వంటి ఎన్నో చిత్రాలలో నటుడిగా నటించిన ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించి ఎన్నో చిత్రాలను విజయవంతం కూడా చేశారు. దాసరి నారాయణరావు విషయానికి వస్తే దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తన దర్శకత్వంలో ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలను తెరకెక్కించడం జరిగింది.ఇక రాజకీయ విషయానికి వస్తే నందమూరి తారకరామారావు టిడిపి పార్టీ ని ఏర్పాటు చేయగా.. దాసరి నారాయణ రావు మాత్రం తన బాల్యం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆప్తమిత్రుడుగా వ్యవహరించసాగాడు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య వైరం కుదిరినప్పటికీ సినిమాలలో ఉన్నంతసేపు వీరిద్దరి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేది. ఇక ఒకానొక సమయంలో ఎన్టీరామారావును అలా చూసి దాసరి నారాయణరావు మంత్ర ముగ్ధులై ఏకంగా ఆయన కాళ్లు తాకారు అన్నట్టు గా .. ఈ విషయం గతంలో కూడా సంచలనంగా మారింది. అయితే ఎందుకు ఇలా జరిగింది అనే విషయానికి వస్తే.. అల్లూరి సీతారామరాజు గెటప్లో ఎన్టీఆర్ ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కానీ కృష్ణ ముందే అల్లూరి సీతారామరాజు సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
కానీ ఆ తర్వాత నందమూరి తారకరామారావు అల్లూరి సీతారామరాజు గెటప్ లో దాసరి ముందు నిలబడినప్పుడు.. అల్లూరి సీతారామరాజు గా దాసరి నారాయణరావు ఎన్టీఆర్ ని చూసి భావించి వెంటనే ఆయన కాళ్లు తాకారు. నిజంగా అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ రూపంలో మన ముందుకు వచ్చారా అన్నంతగా అత్యద్భుతంగా NTR ki ఆ గెటప్ సెట్ అయింది. ఇక ఈ విషయం కాస్త అప్పట్లో సంచలనంగా మారినా.. ఇద్దరు స్నేహితుల మధ్య ఇలాంటివి ఏవి పెద్దగా పట్టించుకోరు అని వారు కొట్టిపారేశారు.