కేసీఆర్ ఢిల్లీ టూర్ ను సడెన్ గా క్యాన్సల్ చేసుకోవడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ వివిధ రాజకీయ నాయకులతో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసినా డీల్ కుదరలేదని విమర్శించారు. ప్రధాని మోదీ 26 తేదీన వస్తే గౌరవ సూచకంగా ముఖ్యమంత్రులు కలుసుకోవాలని… గతంలో మీరు ప్రధాని మోదీని రిసీవ్ చేసుకోలేదని.. ఈసారి అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారని అందుకే వచ్చాడని కేఏ పాల్ అన్నారు. పార్థసారధికి రాజ్యసభ సీటును అమ్ముకున్నారని… నాకు ఇన్ఫర్మేషన్ ఉందని పాల్ అన్నారు. పార్థసారధి గారి అక్రమాలను నేను బయటపెడుతున్నానని వచ్చాడని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 3100 మంది ముఖ్య నేతలను నేను కలిశానని… ఎవరి పేర్లు చెప్పడం లేదని.. నిన్న 23 మంది పెద్ద లీడర్లను కలిశానని ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారని అన్నారు. కేసీఆర్ తో ఒక్కరూ లేరని.. నాతో 18 పార్టీలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇక్కడ రైతులు చనిపోతుంటే వేరే రాష్ట్రాల వారికి డబ్బులు ఎందుకు పంచుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ నాతో పాటు ఉన్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మోడీ ముక్త్ భారత్ కావాలని అంతా కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ దేశదిమ్మరిగా తిరుగుతున్నారని విమర్శించారు. బీజేపీ దేశాన్ని, టీఆర్ఎస్ తెలంగాణను , చంద్రబాబు, జగన్ ఏపీని నాశనం చేశారని అన్నారు.