ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న త్రిషకు స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పింది చార్మి. ఇద్దరు కలిసి ప్రభాస్ హీరోగా నటించిన పౌర్ణమి సినిమాలో నటించారు. అప్పటి నుండి ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇక ఈరోజు బర్త్ డే సదర్భంగా బర్త్ డే విష్ తో పాటుగా బేబీ ఐలవ్యూ నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. నా ప్రపోజల్ ను నువ్వు ఎప్పుడు ఓకే అంటావా అని మోకాళ్ల మీద నిలబడి ఎదురుచూస్తున్నా.. చట్టపరంగా కూడా అది సమ్మతమే అంటూ త్రిష చార్మికి బుద్దు పెట్టిన పిక్ షేర్ చేసింది.
ఇదవరకు కూడా త్రిషకు చార్మి ఇలానే ప్రపోజ్ చేయగా ఆమె చార్మి ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసింది. ప్రస్తుతం త్రిష కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన 96 సినిమా మళ్లీ త్రిషకు కోలీవుడ్ లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. 3 పదుల వయసులో కూడా త్రిష వరుస సినిమా అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం త్రిష లీడ్ రోల్ లో పరమపదం విలయాట్టు సినిమా వస్తుంది. ఆమె బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
Baby I love u today n forever ?
Am on my knees waiting for u to accept my proposal ? let’s get married?? ( now toh it’s legally allowed also ? ) #happybirthday @trishtrashers ???? pic.twitter.com/e2F3Zn3Dp3— Charmme Kaur (@Charmmeofficial) May 4, 2019