అరిస్తే చంపేస్తానంటూ.. విద్యార్థినిపై ఉపాధ్యాయుడు కీచకపర్వం..

-

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే చెడుదారులు తొక్కతున్నారు. ఉన్నత శిఖరాలు అదిరోహించే విధంగా స్పూర్తి నింపాల్సి ఉపాధ్యాయులు.. నీచపు పనులు చేస్తూ.. కటకటాల పాలవుతున్నారు. అలాంటి ఘటనే ఇది.. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఈటా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక తొమ్మిదవ తరగతి చదువుకుంటోంది. ఆమె గత వారం పరీక్ష రాసేందుకు స్కూలుకు వెళ్లింది. పరీక్ష అయిపోగానే అందరూ ఇంటికి వెళుతుండగా.. ఆ స్కూలులో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు బాలికను ఆపి తరగతి గదిలో ఉన్న కుర్చీని పక్క గదిలోకి తీసుకురమ్మన్నాడు. ఉపాధ్యాయుడు చెప్పినట్లుగానే బాలిక ఒక కుర్చీని పక్క గదిలోకి తీసుకెళ్లింది.

Attempt to rape minor, 55-year-old accused arrested | NewsTrack English 1

ఆ గదిలోకి వెళ్లగానే బాలిక వెనుక నుంచి ఆ ఉపాధ్యాయుడు కూడా వెంటనే వచ్చి గదికి లోపలి నుంచి లాక్ చేశాడు. అది చూసి బాలిక ఒక్కసారిగా భయపడి పోయింది. ఆ తరువాత ఆమె గట్టిగా అరుస్తూ ఉండడంతో అతను బాలిక నోరు మూసి చంపేస్తానని బెదిరించి.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయట ఎవరికీ చెప్ప కూడదని లేకపోతే మళ్లీ అదే జరుగుతుందని భయపెట్టాడు. ఆ ఉపాధ్యాయుడు ఆ స్కూలు ప్రిన్సిపాల్ కుమారుడు కూడా. దీంతో బాలిక ఆ ఘటన గురించి బయట ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయింది.

ఇంటికి వణుకుతూ వచ్చిన బాలికను చూసి ఆమె తల్లి ఏం జరిగిందని ఆరా తీసింది. మొదటి చెప్పడానికి భయపడిన బాలిక.. తల్లితో తన బాధ చెప్పుకుంది. బాలిక చెప్పిన మాటలు విని షాకైన ఆమె తల్లి వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కోసం స్కూలుకు వెళ్లారు. అక్కడ ఆ ఉపాధ్యాయుడు లేకపోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేయడానికి గాలింపు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news