విక్టరీ వెంకటేశ్ -వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ F3. F2కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలై దూసుకుపోతున్నది. జనాలు ఈ సినిమా చూసి థియేటర్లలో నవ్వుకుంటున్నారు.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ పిక్చర్ బాగా నచ్చుతోంది. ఈ క్రమంలోనే సినిమాకు చక్కటి కలెక్షన్స్ వస్తున్నాయి. బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోందిఈ మూవీ. సమ్మర్ సోగ్గాళ్లు అయిన వరుణ్ తేజ్, వెంకటేశ్ జనాలను సినిమాలో చక్కగా ఎంటర్ టైన్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.73 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ ట్రాకర్ రమేశ్ బాలా తెలిపారు. సమ్మర్ సాలిడ్ హిట్ గా ఈ చిత్రం నిలవడం పట్ల మూవీ యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ ఇందులో నటించగా, స్పెషల్ సాంగ్ పూజా హెగ్డే చేసింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయగా, ఇప్పుడు వసూళ్ల వర్షంతో ఆయన సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Blockbuster Ante Itta Vundaalaa !!! 💪🏻💪🏻💥💥
With Tremendous Response all over🙌#F3Movie mints a
WW Gross of 73crores in 4 Days 🔥Going Super Strong with Solid Run 🤩#F3TripleBlockbuster 🍿@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic pic.twitter.com/a1DAsHnnNa
— Ramesh Bala (@rameshlaus) May 31, 2022