క్యాబ్‌ కోసం చూస్తున్న విదేశీ మహిళపై గ్యాంగ్‌ రేప్..

-

కామాంధులు రోజు రోజుకు బరితెగించిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. తాజాగా గుర్గావ్‌లో చోటు చేసుకున్న ఘటన మరో నిర్భయను గుర్తుకు తెస్తుంది.
ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌ కోసం ఎదురుచూస్తున్న కెన్యా దేశస్థురాలైన మహిళలను ఇంటి వద్ద దింపుతామని నమ్మబలికి కారు ఎక్కించుకుని ఆమెపై అత్యాచారం జరిపారు. ఈ దారణమైన ఘటన బుధవారం గుర్గావ్‌లో చోటుచేసుకుంది. పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్గావ్‌లోని బ్రిస్తోల్‌ చౌక్‌లో తాను నివాసం ఉండే దక్షిణ ఢిల్లీ చత్తపూర్‌కు వెళ్లేందుకు క్యాబ్‌ కోసం ఎదురుచూస్తున్న మహిళను ముగ్గురు యువకులు స్కార్పియోలో వచ్చి చత్తపూర్‌లో దింపుతామని చెప్పి కారులో ఎక్కించుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.

The police said it wasn't rape it was rough sex' - BBC Three

ఆమెను ఒక  నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు వారి స్నేహితులను మరో ఇద్దరి ఫోన్‌ చేసి అక్కడికి పిలిపించారు. మొత్తం ఐదుగురు అతి దారుణంగా ఆమెపై అత్యాచారం జరిపారు. అనంతరం ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డా దుండగులు ఆమెను అపస్మారకస్థితిలోకి వెళ్లేలా త్రీవంగా కొట్టి గుర్గావ్‌లోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పడేసి వెళ్లారు. కొంత సేపటికి తెరుకున్న బాధితురాలు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కారు నెంబర్‌ ఆధారంగా ఐదుగురు నిందితుల్లో ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ముగ్గురు నిందతులు సుధీర్‌, మోహిత్‌, ప్రవీణ్‌లుగా పోలీసు గుర్తించి వారి అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళను గుర్గావ్‌లోని ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దాంతో పోలీసు నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 376-డీ కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులో కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news